ఈ భక్తుని అజ్ఞాన కృత్యాన్ని చూసి కూడ నా కైంకర్యాన్ని అభిలషించి, ఈ భూమి పగుళ్ల నుండి అవతరించి నేను సమర్పించిన ఆహారాన్ని స్వీకరించిన ఓ స్వామీ! నమస్కారాలు. ఢమరుకాన్ని పోలిన సన్నటి నడుమును కలిగిన ఉమాదేవిని అర్ధభాగంగా కలిగిన జ్యోతిస్వరూపా! నమస్కారాలు. విభూతిని ధరించిన పగడం పోలిన శరీరాన్ని, జడలను కలిగిన పరమేశ్వరా! నీకు నమస్కారాలు.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది