పరమేశ్వరుని పవిత్ర హస్తము కరవాలాన్ని ధరించిన నాయనారు చేతులను పట్టుకోగా వారు భయపడ్డారు. అప్పుడే కత్తి వలన ఏర్పడిన గాయం మాని పాప కర్మల నుండి విముక్తుడై సంతోషం పొంగులు వారుతుండగా తాయనారు తనను అనుగ్రహించిన పరమేశ్వరునికి చేతులు మోడ్చి నమస్కరించి నిలబడ్డారు.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది