001. తిరుబ్రహ్మపురం
అమ్మ పార్వతీదేవి ఐక్యమైయుండు తన దేహమందలి వామభాగ కర్ణమునకు దుద్దులుండ, వృషభనమును వాహనముగ(జేసుకుని, స్వారీ చేయు ఆ మహేశ్వరుడు, తెల్లని స్వచ్చమైన నెలవంకను శిరస్సుపై ధరించి, స్మశాన బూడిదను పూసుకొనినవాడై, నా మదిని దోచాడు!. వికసించిన తామర పుష్పంపై అమరు బ్రహ్మ, గతమున చేసిన తఫస్సువలన, ఈ బ్రహ్మపురం క్షేత్రంలో, వెలసి మనలందరినీ అనుగ్రహించు పరమేశ్వరుడు ఈతడేకదా! (అవునని భావము!)
శ్రీమతి. శశికళ, ది. M.A., B.Ed., విశాఖపట్నం, 2009