ఏమాత్రం అర్హత పొందినవారైనా తమ ప్రయత్నంతో సమీపించదగిన విశిష్టుడు, బ్రాహ్మణుల మనస్సుల్లో కొలువున్నవాడు, పరమోన్నతమైన వేదాలలోని అంతరార్ధమైనవాడు, అత్యంత సూక్ష్ముడు, తమ ప్రయత్నంతో ఎంతటివారైనా గ్రహించజాలని పరముడు, తేనె, పాలవంటి మధురమైనవాడు, స్థిరప్రకాశుడు, దేవతలకు నాయకుడు, విష్ణు, బ్రహ్మ, అగ్ని, వాయువు, శబ్దించే సముద్రాలు, ఎత్తైన పర్వతాలను తమ తమ క్రియలలో కొనసాగించేవాడు. వ్యాఘ్రపాద మహర్షికి ఆశ్రయమైన చిదంబరంలో కొలువై అనుగ్రహిస్తున్నవాడైన పరమేశ్వరుని కీర్తించని రోజులు వ్యర్థమైనవే. 1
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024