1. కోయిల్ (ఆలయం - చిదంబరం)
తిరునావుక్కరసర్ చిదంబర పుణ్యక్షేత్రంలోని నటరాజస్వామిని కొలిచి అనుగ్రహించిన దశకం. దైవమందిరాలన్నీ ఆలయాలే అయినా చిదంబరంలోని మందిరాన్ని ఆలయమని (కోయిల్-కోవెల) ప్రత్యేకంగా పేర్కొనడం తమిళ సంప్రదాయం. ఇది శ్రేష్ఠత్వసూచకం. తిల్లైచిట్రంబలం, వ్యాఘ్రపురం, పుండరీకపురం, భూలోకకైలాసం అనే పేర్లు కూడా చిదంబరానికుంది.
ముక్తిని ప్రసాదించగల చిదంబరక్షేత్రం ఇహలోకంలో సకలభోగభాగ్యాలను అనుగ్రహించగలదు. ఇంతటి మహిమగల చిదంబర క్షేత్రాన్ని మున్ముందు భక్తిపరవశంతో దర్శించి, సేవించి పరముక్తి మహానందస్థితి అందుకోవడానికి యోగ్యమైన మానవజన్మను పరమాత్మ అనుగ్రహిస్తాడా?
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2024